Shaakuntalam Openings vs Rudrudu Openings: ఈవారం ప్రేక్షకుల ముందుకు రెండు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాతో పాటుగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేయగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన  రుద్రుడు సినిమాని కదిరేషన్ డైరెక్ట్ చేసి స్వయంగా నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సమంత శాకుంతలం సినిమాని దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇక ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన సమంత శాకుంతలం సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని అందరూ భావిస్తుంటే ఒక ఆసక్తికరమైన ట్రేడ్ వర్గాల అంచనా వెలుగులోకి వచ్చింది.


ఇది కూడా చదవండి: Samantha Divorce: నాగచైతన్య మంచి కోరే సమంత విడాకులు ఇచ్చిందా.. వెలుగులోకి షాకింగ్ అంశం!


అదేమిటంటే సమంత సినిమా పాన్ ఇండియా సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులు మాస్ ఏరియాలలో ఈ సినిమా చూడటం కంటే రుద్రుడు సినిమా చూడడం బెటర్ అని దానికి మొగ్గు చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక ట్రేడ్ వర్గాల వారి అంచనా ప్రకారం సమంత శాకుంతలం సినిమా చూసేందుకు కంటే రుద్రుడు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించిన వారు ఎక్కువగా ఉన్నారట. అయితే సమంత శాకుంతలం సినిమాతో పాటు రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాకి కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు.


ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా సమంత సినిమాతో పోల్చుకుంటే రుద్రుడు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని తెలుస్తోంది. సమంత సినిమా పూర్తి స్థాయి క్లాస్ సినిమా కాగా రుద్రుడు సినిమా మాస్ సినిమా. అయితే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే విషయం మీద ఆధారపడి రెండు సినిమాలు భవితవ్యం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సమంత సినిమాతో పోల్చుకుంటే రుద్రుడు సినిమా వసూళ్ల విషయంలో జోరు చూపుతుందో? లేదో చూడాలి మరి. 


ఇది కూడా చదవండి: Rudrudu Movie Review: ఆ నరుకుడేంది? మాకు బాలయ్య ఉన్నాడుగా లారెన్స్.. ఇదేం అరాచకమయ్యా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook